- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహ వేడుకలో డ్యాన్స్.. కుప్పకూలి వ్యక్తి మృతి
విహహ వేడుకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: విహహ వేడుకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యువతీ, యువకుడికి గురువారం రాత్రి పెళ్లి జరిగింది. ఈ పెళ్లిలో విందు, చిందు ఏర్పాటు చేశారు. దీంతో వేడుకకు వచ్చిన బంధువు డీజే పాటలకు స్టెప్పులు లేస్తున్నారు. అయితే ఒక్కసారిగా కుప్పకులి మృతి చెందారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. పాలకొండ మండలం బాసూరు గ్రామంలో రాత్రి పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి బంగారు నాయుడు వెళ్లారు. అక్కడ పెట్టిన డీజే పాటలకు స్టెప్పులు వేశారు. అయితే డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మిగిలిన వారు గమనించి ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బంగారు నాయుడు మృతికి గుండెపోటు కారణమని పేర్కొన్నారు. అప్పటి వరకూ ఎంతో ఉత్సాహంగా కనిపించిన బంగారు నాయుడు తాము చూస్తుండగానే ఒక్కసారిగా చనిపోవడం స్థానికులను కలిచివేసింది.






