గడ్డి మందు తాగిన రైతు కుటుంబం.. తీవ్ర విషాదం

by Vemula.Srinu Prasad |

నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది...

గడ్డి మందు తాగిన రైతు కుటుంబం.. తీవ్ర విషాదం
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా(Nandyala District) పాములపాడు మండలం ఇస్కాల గ్రామం(Iskala Village)లో తీవ్ర విషాదం(Tragedy) చోటు చేసుకుంది. అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. పంటలు పండకపోవడం, తీసుకున్న అప్పులుకు వడ్డీ కట్టలేక సోమేశ్వరుడుతో పాటు మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులు కూల్ డ్రింకులో గడ్డి మందు కలుపుకుని తాగారు. దీంతో వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో సోమేశ్వరుడు కుమారుడు భరత్ కుమార్, భార్య లావణ్య మృతి చెందారు. మిగిలిన ముగ్గురి పరిస్థితి కొంత మెరుగుపడినట్లు తెలుస్తోంది. దీంతో వారి బంధువులు ఇస్కాలలో ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

Next Story