- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీలో విషాదం.. సీనియర్ నేత సుకుమార్ రెడ్డి మృతి
అన్నమయ్య జిల్లా వైసీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamaya District) వైసీపీ(Ycp)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రైల్వే కోడూరు మండలం(Railway Kodur Mandalam) సీనియర్ నేత, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ పంచం సుకుమార్ రెడ్డి(Sukumar Reddy) మృతి చెందారు. చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సుకుమార్ రెడ్డి బాధపడుతున్నారని, ఇటీవల కాలంలో పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి సుకుమార్ రెడ్డి తుది శ్వాసం విడిచారు. సుకుమార్ రెడ్డి మృతి పట్ల పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు.
కాగా రాజకీయ తొలినాళ్ల నుంచి సుకుమార్ రెడ్డికి వైఎస్ కుటుంబంతో సత్సంబంధాలున్నాయి. 2000-2011 మధ్య అనంతరాజుపేట పంచాయతీ సర్పంచ్‌గా రెండు పర్యాయాలు పని చేశారు. జగన్ ప్రభుత్వంలోనూ వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్‌గా వర్క్ చేశారు.






