- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: క్రికెట్ ఆడుతుండగా పిడుగుపాటు.. తీవ్ర విషాదం
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెద్దఓబినేనిపల్లి(Peddaobinenipalli)లో పిడుగుపాటు(Thunder)కు ఇద్దరు యువకులు మృతి చెందారు. ఆకాష్ (17), పులిగుజు తన్ని(18) క్రికెట్ ఆడుతుండగా గ్రౌండ్‌లో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పిడుగు విరుచుకుపడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆకాష్, తన్ని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆకాష్ , పులిగుజు తన్ని మృతి చెందడంతో తోటి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. వాళ్లిద్దరు ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అటు తల్లిదండ్రులు సైతం కన్నీరు మున్నీరవుతున్నారు. వర్షం పడకపోయినా తమ పిల్లలను పిడుగు తీసుకెళ్లిపోయిందని వాపోయారు.






