- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫేక్ మెయిల్.. ఆంధ్రా యూనివర్సిటీలో టెన్షన్.. టెన్షన్...!
విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణ కొనసాగింది.....

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ(Visakha Andhra University)లో టెన్షన్ వాతావరణ కొనసాగింది. వర్సిటీలో బాంబు(Bomb) పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్(Mail) పంపారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. యూనివర్సిటీలోని తరగతి గదులతో పాటు ప్రాంగణంలోనూ సోదాలు చేశారు. అయితే బాంబు లేదని గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంతంగా ఉండే యూనివర్సిటీలో బాంబు బెదిరింపుతో ఈ రోజు భయాందోళనలు నెలకొన్నాయి.
ఫేక్ గాళ్లు ఎవరు..?
అయితే ఫేక్ బాంబు బెదిరింపు చేసింది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భయాందోళనకు గురయ్యే కాల్స్, మెయిల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాస్తవ సమాచారాన్ని అందజేయడం తప్పు కాదని, ఫేక్ కాల్స్, మెయిల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దని సూచించారు. ఫేక్ కాల్స్ వల్ల కొన్ని సమయాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






