విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం.. గంటకు పైగా నిలిపివేత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-07 16:57:13  IST  )

విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది..

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం.. గంటకు పైగా నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు(Visakhapatnam Express train)లో సాంకేతిక లోపం(Technical Error) తలెత్తింది. దీంతో రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. భువనేశ్వర్(Bhubaneswar) నుంచి సికింద్రాబాద్(Secunderabad) వెళ్తుండగా ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి(Rajahmundry)లో రైల్వే స్వేషన్‌లో జరిగింది. రైలు ఏసీ కోచ్‌లో సమస్య తలెత్తినట్లు గుర్తించారు. గంటకు పైగా రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మరమ్మతుల తర్వాత రైలు యథావిధిగా సికింద్రాబాద్ బయల్దేరి వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

Next Story