పోలవరం ప్రాజెక్టును సందర్శించిన నిపుణుల బృందం.. నిర్మాణ పనుల పై ఆరా!

by Jakkula.Mamatha |

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన నిపుణుల బృందం.. నిర్మాణ పనుల పై ఆరా!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం(AP Government) పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ తరుణంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇవాళ(సోమవారం) పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)ను అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. అంతర్జాతీయ నిపుణులు(International experts) రిచర్డ్ డొన్నెల్లి, సీన్ హించ్ బెర్జర్, జియాన్ఫ్రాన్కో డి సికో, డేవిడ్ బి పాల్ ఇక్కడ జరుగుతున్న నిర్మాణ పనులు వారు పరిశీలించారు. నిపుణుల బృందం సభ్యులు డయాఫ్రం వాల్ పనులు, ఎగువ కాపర్ డ్యాం పటిష్టత పై ఆరా తీశారు. ఈ బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి తగు సూచనలు, సలహాలను జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో PPA సభ్య కార్యదర్శి ఎం.రఘురాం, కేంద్ర జల సంఘం అధికారులు, సరబ్జిత్ సింగ్ భక్షి, రాకేష్, అశ్వనీకుమార్ వర్మ, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, CSMRS అధికారులు మనీష్ గుప్తా, లలిత్ కుమార్ సోలంకి జరుగుతున్న పనులపై సమీక్షించారు. ప్రాజెక్టు సీఈ కె.నరసింహమూర్తి, MEIL చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు పనుల పురోగతిని వారికి వివరించారు.

Next Story