- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap: కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
by Vemula.Srinu Prasad |
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొబ్బరి పీచు ఫ్యాక్టరీ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ...

X
దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District) ఆత్రేయపురం(Atreyapuram) మండలంలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. కొబ్బరి పీచు ఫ్యాక్టరీ(Coir Factory)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటన స్థానికంగా భయాందోళన కలిగింది. మంటలు చెలరేగిన సమయంలో పొగలు భారీగా అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఫైర్ సిబ్బంది సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Next Story






