కూలర్‌లో షార్ట్ సర్క్యూట్.. క్షణాల్లోనే ఇళ్లన్నీ దగ్ధం

by Vemula.Srinu Prasad |

కడప జిల్లా ప్రొద్దుటూరు గీతాశ్రమం రోడ్డులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

కూలర్‌లో షార్ట్ సర్క్యూట్.. క్షణాల్లోనే ఇళ్లన్నీ దగ్ధం
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa District) ప్రొద్దుటూరు గీతాశ్రమం(Proddatur Geethashram) రోడ్డులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఓ ఇంట్లోని ఎయిర్ కూలర్‌(Air Cooler)లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే పక్కపక్కనే ఉన్న మరో మూడు ఇళ్లకు మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, ఈ ప్రమాదంలో ఇళ్లలోని సామాగ్రి కాలిపోయి ఆస్తి నష్టం వాటిల్లింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story