క్లాస్ రూమ్‌లో విషాదం.. పాఠాలు వింటూనే అనంతలోకాలకు విద్యార్థిని

by Vemula.Srinu Prasad |

పాఠాలు వింటూనే క్లాస్ రూమ్‌లోనే గుండెపోటుతో విద్యార్థిని మృతి చెందారు..

క్లాస్ రూమ్‌లో విషాదం..  పాఠాలు వింటూనే అనంతలోకాలకు విద్యార్థిని
X

దిశ, వెబ్ డెస్క్: పొద్దునే లేచి రెడీ అయి స్కూలుకు వెళ్లిన విద్యార్థిని(Student) మధ్యాహ్నానికల్లా విగత జీవిగా మారారు. క్లాస్ రూమ్‌(Class Room)లో టీచర్(Teacher) చెబుతున్న పాఠాలను శ్రద్ధగా వింటున్న సమయంలో సడెన్‌గా విద్యార్థిని సృహ కోల్పోయి కింద పడిపోయింది. దీంతో విద్యార్థినిని టీచర్లు, తోటి విద్యార్థులు పైకిలేపి ఆస్పత్రికి తరలించారు. ఈలోపే విద్యార్థిని మరణించింది. దీంతో స్కూలుతోపాటు గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగింది.

పసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి సిరి(14) రామచంద్రపురంలోని ఓ ప్రైవేటు స్కూల్ లో పదవ తరగతి చదువుతుంది. రోజూ మాదిరి ఈ రోజు కూడా స్కూలుకు వెళ్లింది. పాఠాలు వింటూనే క్లాస్ రూమ్‌లో సిరి కుప్పకూలిపోయింది. దీంతో విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. అయితే సిరి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Next Story