రాష్ట్రంలో వింత వ్యాధి కలకలం.... చిన్నారికి ఒంటి నిండా బొబ్బలు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో వింత వ్యాధి కలకలం రేపింది. ...

రాష్ట్రంలో వింత వ్యాధి  కలకలం.... చిన్నారికి ఒంటి నిండా బొబ్బలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వింత వ్యాధి(strange disease) కలకలం రేపింది. కృష్ణా జిల్లా(Krishna District) పెనుగంచిప్రోలు(Penuganchiprol)లో చిన్నారికి ఒంటి నిండా బొబ్బలు వచ్చాయి. రెండు మొకాళ్లపై పుట్టలు పుట్టలుగా బొబ్బలు రావడంతో చిన్నారికి వైద్యం అందించారు. వైద్యం తర్వాత ఇన్ ఫెక్షన్ తగ్గిపోయింది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

అయితే చిన్నారికి వైరస్ వ్యాధి సోకిందనే ప్రచారం జరిగింది. దీంతో స్థానికంగా ఉన్న చిన్నారుల త‌ల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు పెనుగంచిప్రోలులో జిల్లా వైద్య బృందం పర్యటించింది. బొబ్జలు వచ్చిన చిన్నారిని పరిశీలించారు. చిన్నారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు.

Next Story