Sports City : అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ముందడుగు

by M.Rajitha |   ( Updated:2025-04-14 15:49:10.0  )
Sports City : అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ముందడుగు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP) రాజధాని అమరావతి(Amaravathi)లో స్పోర్ట్స్ సిటీ(Sports City) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి అనువైన భూముల కోసం మంత్రి నారాయణ(Minister Narayana), పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్ తో కలిసి విజయవాడలో ఇబ్రహీంపట్నంలోని కృష్ణా నది లంక భూములను(Lanka Lands) పరిశీలించారు. ఎన్టీఆర్ కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పెదలంక, చినలంక భూములను పరిశీలించిన అనంతరం.. మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేలా ఈ స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని సీఎం చందబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆదేశాలు జారీ చేశారన్నారు.

ఇందుకోసం 2 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని తెలిపారు. లంకభూముల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై త్వరలోనే కమిటీ వేస్తున్నట్టు పేర్కొన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నట్టు తెలిపిన మంత్రి నారాయణ.. ప్రతిరోజు 3 వేల మంది కార్మికులతో, 500 యంత్రాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.

Next Story