ఏపీ రాజధానిలో కీలక సమావేశం.. ఆ ప్రాజెక్టులపై సమీక్ష

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-02 14:05:43  IST  )

రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు..

ఏపీ రాజధానిలో కీలక సమావేశం.. ఆ ప్రాజెక్టులపై సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జాతీయ రహదారుల(National High ways) అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో పలు చోట్ల జాతీయ రహదారుల నిర్మాణాలకు ఇప్పటికే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇతర రాష్ట్రాలకు కనెక్టివిటీని పెంచేందుకు మరిన్ని రహదారులు నిర్మించాలనే డిమాండ్ల వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Central Minister Nitin Gadkari)ని కలిశారు. రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిని వివరించారు. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితులను పరిశీలించాలని గడ్కరీని సీఎం చంద్రబాబు కోరారు.

అయితే సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు శనివారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి వచ్చారు. వెంటనే సీఎం చంద్రబాబుతో పాటు అధికారులను కలిశారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ. 5.233 కోట్ల విలువైన పనులకు చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రస్తుతం అమరావతిలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరితో పాటు రహదారులకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సి ప్రాజెక్టులపై చర్చించారు. మరిన్ని ప్రాజెక్టులకు అనుమతులతో పాటు నిధులు విడుదల చేయాలని నితిన్ గడ్కరీని చంద్రబాబు కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Next Story