- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP: వామ్మో.. ఏసీలో పాము పిల్లలు..!
విశాఖ జిల్లా పెందుర్తిలో షాకింగ్ ఘటన జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా పెందుర్తి(Pendurti)లో షాకింగ్ ఘటన జరిగింది. సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోని ఏసీ(AC)లో పాము పిల్లలు(Snake Babies) ఉండటం కలకలం రేగింది. ఏసీని క్లీన్ చేసేందుకు సత్యనారాయణ ప్రయత్నం చేశారు. అయితే అందులో పాము పిల్లలు కనిపించాయి. దీంతో ఆయన భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్(Snake Catcher Kiran)కు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి వచ్చిన సత్యనారాయణ.. ఏసీలో నుంచి పాము పిల్లలను బయటకు తీశారు.
అయితే ఏసీలోకి పాము పిల్లలను ఎలా వచ్చాయనేది మిస్టరీగా మారింది. కానీ పాము పిల్లలు ఉన్నాయంటే ఆ ఇంట్లో పెద్ద పాము ఉన్నట్టేనని స్థానికులు కొందరు చెబుతున్నారు. దీంతో ఇంటి కుటుంబ సభ్యులు భయపడిపోతున్నారు. పెద్ద పాము తమను ఏమైనా చేస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి మొత్తాన్ని స్నేక్ క్యాచర్ సత్యనారాయణ పరిశీలించారు. పాము కనిపించకపోవడంతో ఇంటి కుటుంబ సభ్యులకు ప్రస్తుతం ఉపశమనం లభించింది.






