సభ్య సమాజం తలదించుకునే ఘటన.. నిందితుడి అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-19 10:28:28  IST  )

అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలా ఘటన తాగాగా వెలుగుచూసింది...

సభ్య సమాజం తలదించుకునే ఘటన.. నిందితుడి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli)లో దారుణం జరిగింది. సభ్య సమాజం తలదించుకునే ఘటన తాజాగా వెలుగుచూసింది. ఏడేళ్ల మైనర్ బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారి ఏడుపు గమనించిన కుటుంబ సభ్యులు విషయాన్ని గ్రహించేలోపే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడికోసం ప్రత్యేక బృందాలతో గాలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో (POCSO) చట్టం సెక్షన్లతో కేసు నమోదు చేశామని, నిందితుడికి కఠిన శిక్ష తప్పదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Next Story