- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 35 మందికి గాయాలు
by Vemula.Srinu Prasad |
తిరుపతిలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. చంద్రగిరి(Chandragiri) మండలం ఐతేపల్లి(Itepally) వద్ద ఆర్టీసీ బస్సు(Rtc Bus) అదుపు తప్పింది. అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 35 మందికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరో పది మందికి స్వల్పంగా గాయాలు కావడంతో వారందరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డివైడర్‌ను ఢీకొట్టడంతో బస్సులో చాలా మంది ఇరుక్కుపోయారు. దీంతో స్థానికులు వారందరిని బయటకు తీశారు. తిరుమణ్ణావలై నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






