స్కూటీని ఢీకొట్టిన లారీ: ముగ్గురు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

స్కూటీని ఢీకొట్టిన లారీ: ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరాడ పోలీస్ స్టేషన్ సమీపంలో స్కూటీ(Scooty)ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. కురిసేల(Kurisela) గ్రామానికి చెందిన కార్తీక్, ఉదయ్ కిరణ్, జగన్ స్కూటీపై వెళ్తుండగా కొమరాడ పీఎస్ మలుపు వద్ద లారీ(Lorry) ఢీకొట్టింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులుగా గుర్తించారు. ముగ్గురు యువకుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు కావడంతో కురిసేల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story