కుప్పంలో ఘోరం.. ఇద్దరు యువతులపైకి దూసుకొచ్చిన లారీ, వ్యక్తి మృతి

by Vemula.Srinu Prasad |

చిత్తూరు జిల్లా కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

కుప్పంలో ఘోరం.. ఇద్దరు యువతులపైకి దూసుకొచ్చిన లారీ,  వ్యక్తి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుప్పం(Kuppam)లో లారీ(Lorry) బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నిలబడి ఉన్న ఇద్దరు యువతులపైకి లారీ దూసుకొచ్చింది. క్షణాల్లో అప్రమత్తం కావడంతో యువతులు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో స్పాట్ లోనే గౌతమ్ అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన గౌతమ్ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో లారీ అదుపు తప్పినట్లు డ్రైవర్ తెలిపారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story