నేషనల్ హైవేపై లారీ బీభత్సం.. దంపతులు దుర్మరణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-25 16:13:01  IST  )

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

నేషనల్ హైవేపై లారీ బీభత్సం.. దంపతులు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి(Devarapalli)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. జాతీయ రహదారిపై లారీ(Lorry) బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న కుటుంబాన్ని వేగంగా ఢీకొట్టింది. దీంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు పిల్లలు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Next Story