Breaking: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-31 11:28:17  IST  )

కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

Breaking: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా(Krishna District) అవనిగడ్డ(Avanigadda)లో రోడ్డు రక్తసిక్తమైంది. లారీ(Lorry)ని కారు(Car) బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో పసికందు ఉండటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంపై స్థానికుల నుంచి ఆరా తీశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అంచనా వేశారు. ప్రమాదానికి కారణమైన లారీని, కారును పక్కకు తీశారు. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా నిలచిపోయిన ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story