Pongal: పండుగ వేళ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-13 12:08:29  IST  )

ఏపీలో పండగ వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది...

Pongal: పండుగ వేళ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పండగ(Pongal) వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో మరోసారి బదిలీల(Transfers)కు ప్రభుత్వం తెరతీసింది. 2021-22 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం(Government) బదిలీ చేసింది. చింతపల్లి ఏఎస్పీగా నవజ్యోతి మిశ్రాతో పాటు నంద్యాల ఏఎస్పీగా మందా జావళి అల్ఫోన్, రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామ్‌నాథ్‌ హెగ్డే, కాకినాడ ఏఎస్పీగా దేవరాజ్ మనీష్, తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

కూటమి ప్రభుత్వం సమర్థవంతైన పాలన కొనసాగిందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. అధికారంలో వచ్చిన కాలంలో వరుసగా అధికారులను బదిలీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు కమిషనర్లు, అధికారులు, పోలీసులకు స్థాన చలనం కలిగింది. పలు శాఖల్లోనూ ప్రక్షాళన చేపట్టింది. ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం పాలన, శాంతి భద్రతలు విషయంలో మరింత దృష్టి సారించింది. ఇటీవల కాలంలో శాంతి భద్రతలపై విమర్శలు వెల్లువెత్తాయి. తిరుపతి తొక్కిసలాట ఘటనతో పాటు పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రభుత్వ అధికారుల బదిలీలకు శ్రీకారం కుట్టింది. ఇందులో భాగంగా ఐదుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Next Story