Ys Viveka Case: దస్తగిరి ఫిర్యాదు.. మరో నలుగురిపై కేసు నమోదు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-05 11:42:06  IST  )

వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది...

Ys Viveka Case: దస్తగిరి ఫిర్యాదు.. మరో నలుగురిపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకానందారెడ్డి హత్య(Ys Vivekananda Reddy) కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి(Dastagiri) అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే దస్తగిరి ఫిర్యాదు మేరకు తాజాగా నలుగురిపై కేసు నమోదు అయింది. వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ సమయంలో తనను పులివెందుల గత డీఎస్పీ నాగరాజు(Pulivendula DSP Nagaraju), సీఐ ఈశ్వరయ్య(CI Eswariah), కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్(Kadapa Central Jail Superintendent Prakash) ఇబ్బంది పెట్టారని దస్తగిరి పోలీసులకు కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ కుమారుడు చైతన్యరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నలుగురిపై జీరోఎఫ్ఐఆర్ కింద సోమవారం కేసు నమోదు చేశారు. అయితే ఈ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. త్వరలో నలుగురు నిందితులను విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా అట్రాసిటీ కేసులో 2023 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు కడప జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా దస్తగిరి ఉన్నారు. అయితే అరెస్ట్ చేసే క్రమంలో డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య బెదిరించడంతోపాటు వివేకా హత్య కేసులో వైసీపీ నేతలకు అనుకూలంగా మాట్లాడాలని తనను టార్చర్ చేశారని దస్తగిరి ఫిర్యాదు చేశారు. అంతేకాదు 2023 నవంబర్‌లో కడప జైలుకు వచ్చిన చైతన్య రెడ్డి.. రాంసింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని తనకు రూ. 20 కోట్లు ఆఫర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నేతల మాటల విని అప్పటి కడప జైలు సూపరింటెండెండ్ ప్రకాశ్ తనను ఇబ్బందులకు గురి చేశారని ఎస్పీ అశోక్ కుమార్ దస్తగిరి ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురిపై కేసు నమోదు చేశారు.

Next Story