ఉగ్ర దాడిలో విశాఖ వాసి దుర్మరణం.. చంపొద్దని వేడుకున్నా కనికరం చూపని ముష్కరులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-23 02:59:50  IST  )

పహల్‌గామ్ (Pahalgam) ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం (Vishakhapatnam) వాసి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి (Chandramouli) ప్రాణాలు కోల్పోయారు.

ఉగ్ర దాడిలో విశాఖ వాసి దుర్మరణం.. చంపొద్దని వేడుకున్నా కనికరం చూపని ముష్కరులు
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్‌గామ్ (Pahalgam) ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం (Vishakhapatnam) వాసి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి (Chandramouli) ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఉగ్రవాదులకు చంద్రమౌళి ఎదురుపడగా.. పారిపోతున్న క్రమంలో వెంటాడి ఉగ్రవాదులు అతడిని కాల్పి చంపినట్లుగా తెలుస్తోంది. చంపొద్దని వేడుకున్నా.. ‘ఏదైనా ఉంటే వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి’ అంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే, కాల్పులు జరిగిన సుమారు 3 గంటల అనంతరం చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన పహల్‌గామ్ బయలుదేరారు.

కావలికి చెందిన మధుసూదన్ మృతి

పహెల్గాం ఉగ్రవాదుల దాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందని మధుసూదన్ మృతిచెందారు. అయితే, మధుసూదన్ కుటుంబం ఇటీవలే బెంగళూరులో స్థిరపడింది. ఈ క్రమంలోనే ఆయన ఫ్యామిలీతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లగా మధుసూదన్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Next Story