భార్య కళ్లెదుటే అతికిరాతకం.. ఆరుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-16 10:52:16  IST  )

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రియల్టర్ దారుణ హత్యకు గురయ్యారు..

భార్య కళ్లెదుటే అతికిరాతకం.. ఆరుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి..!
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా (Annamaya District)మదనపల్లి(Madanapally)లో రియల్టర్ దారుణ హత్యకు గురయ్యారు. భార్య కళ్లెదుటే భర్త గంగాధర్‌ను దుండగులు కిరాతకంగా కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. గత రాత్రి అర్ధరాత్రి ఆరుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న తన భర్త గంగాధర్‌పై దాడి చేసి చంపారని భార్య తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన తల్లి, తండ్రిలకు సంబంధించిన ఆస్తుల వివాదంలో గంగాధర్‌పై ఆరోపణలు ఉన్నాయని సమాచారం. తన తండ్రి హత్య కేసులోనూ ఆయనపై ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. గంగాధర్ రెండో పెళ్లి చేసుకున్నారని, మొదటి భార్య నుంచి కూడా వివాదాలు ఉన్నాయా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏమైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇంటీ సీసీ టీవీ పుటేజ్ పని చేయకపోవడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం గంగాధర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

Next Story