Tirumala:శ్రీవారి సేవలో ప్రముఖ నిర్మాత

by Jakkula.Mamatha |

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలివస్తారు.

Tirumala:శ్రీవారి సేవలో ప్రముఖ నిర్మాత
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలివస్తారు. ఈ క్రమంలో ఇవాళ(మంగళవారం) ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు(Producer Dil Raju) కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ తరుణంలో దిల్ రాజు తన భార్య, కుమారుడితో కలిసి ఈ రోజు తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

తొలుత టీటీడీ(TTD) అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం నిర్మాత దిల్ రాజు కుటుంబంతో కలిసి ఆలయంలోకి వెళ్లి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, ఈ రోజు వేకువజామున ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Next Story