- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోతుల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. 40 మందికి తృటిలో తప్పిన ప్రమాదం
by Vemula.Srinu Prasad |
ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగంగా గోతుల్లోకి దూసుకెళ్లింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగంగా గోతుల్లోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. హైదరాబాద్ నుంచి రోజు మాదిరిగా విజయవాడకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్ద అదుపు తప్పింది. వెంటనే రోడ్డు పక్కన ఉన్న గోతుల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ వెంటనే బ్రేక్ వేసి బస్సును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారికి నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






