- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
by GSrikanth |
తెలుగుదేశం పార్టీ యువ నేత పరిటాల శ్రీరామ్‌పై పోలీస్ కేసు నమోదు అయ్యింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ యువ నేత పరిటాల శ్రీరామ్‌పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై శ్రీరామ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా.. ఉద్రిక్తతలకు కారణమయ్యేలా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ అంశంపై ఆత్మకూరు ఎస్ఐ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. పరిటాల శ్రీరామ్‌తోపాటు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్‌పై కూడా కేసు నమోదు చేసిట్టు వెల్లడించారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 153 ఏ, 505 (2) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
Next Story






