తిరుమల లడ్డూ వ్యవహారం.. వెంకటరావు నియామకం చెల్లదని హైకోర్టు ఆదేశం

by Vemula.Srinu Prasad |

తిరుమల లడ్డూ కల్తీ ఘటనలో దర్యాప్తు అధికారిగా వెంకటరావు కొనసాగడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది...

తిరుమల లడ్డూ వ్యవహారం.. వెంకటరావు నియామకం చెల్లదని హైకోర్టు ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ(Tirumala laddu adulteration)ఘటనలో దర్యాప్తు అధికారిగా వెంకటరావు కొనసాగడంపై హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సిట్ దర్యాప్తు(SIT investigation) అధికారిగా వెంకటరావు నియామకం తగదని తేల్చింది. అంతేకాదు నిష్పాక్షపాతంగా, స్వతంత్రంగా దర్యాప్తు కొనసాగించాలని ఆదేశింది. సుప్రీంకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సిట్ దర్యాప్తు చేయాలని హైకోర్టు సూచించింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన అంశం కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాలను ఫాలో అవ్వాలని ఆదేశించింది.

Next Story