- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సౌతాఫ్రికాలో కుమారుడు మిస్సింగ్... తల్లి కన్నీరు మున్నీరు
సౌతాఫ్రికాలో కొడుకు మిస్సింగ్‌పై ఏపీలో ఉన్న తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నారు..

దిశ, వెబ్ డెస్క్: సౌతాఫ్రికాలో కొడుకు మిస్సింగ్‌పై ఏపీలో ఉన్న తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన కొడుకు ఆచూకీ తెలపాలని కోరుతున్నారు. తన కుమారుడిని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ క్షేమంగా ఇంటికి చేర్చాలని ఆమె కోరారు. శ్రీసత్యసాయి జిల్లా తలుపులు మండలం కొవ్వూరు వాండ్లపల్లికి చెందిన రామచంద్ర ఏడాది క్రితం సౌతాఫ్రికా వెళ్లారు. బోర్ వెల్స్‌లో పని చేస్తూ అప్పుడప్పుడు ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడేవారు. అయితే నవంబర్ 22న నుంచి రామచంద్ర నుంచి ఎలాంటి ఫోన్ గాని, సమచారం లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రామచంద్రను సౌతాఫ్రికాలో కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని, అతను పని చేసే సంస్థ యజమాని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత నుంచి ఎలాంటి వివరాలు తమకు తెలియలేదని రామచంద్ర తల్లి వాపోయారు. తమ బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చాలని ప్రభుత్వాన్ని ఆమె కోరుకున్నారు.






