- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో అగ్నిప్రళయం: కొత్తరోడ్డు వద్ద భారీగా పేలిన సిలిండర్లు..!
విశాఖపట్నం కొత్తరోడ్డు సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్ గోడౌన్‌లో చెలరేగిన మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న ఇతర స్క్రాప్ దుకాణాలకు విస్తరించాయి

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం(Visakhapatnam) కొత్తరోడ్డు సమీపంలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. స్క్రాప్ గోడౌన్(Scrap Warehouse)లో చెలరేగిన మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న ఇతర స్క్రాప్ దుకాణాలకు విస్తరించాయి. దుకాణాల్లో భారీగా నిల్వ ఉన్న పాత సామాగ్రి కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
స్క్రాప్ గోడౌన్లలో పేలిన సిలిండర్లు
అయితే స్క్రాప్ గోడౌన్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పేలుళ్ల ధాటికి మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. ప్రస్తుతం ఐదు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటలు మరింత వ్యాపించకుండా ఆర్పేందుకు గంటల తరబడి పోరాటం చేశారు.
తీవ్ర భయాందోళనలు
ఈ అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి అతి సమీపంలోనే ఒక పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒకవేళ మంటలు బంక్ వరకు పాకితే భారీ విస్పోటనం జరుగుతుందన్న ఆందోళననను వ్యక్తం చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.






