ఎస్ఆర్బీసీ ఈఈ ఇంట్లో భారీ చోరీ... 60 తులాల బంగారం, రూ.30 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు

by Vemula.Srinu Prasad |

పట్టపగలు భారీ చోరీ జరిగిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది...

ఎస్ఆర్బీసీ ఈఈ ఇంట్లో భారీ చోరీ... 60 తులాల బంగారం, రూ.30 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
X

దిశ, వెబ్ డెస్క్: పట్టపగలు భారీ చోరీ జరిగిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. ఆత్మకూరు సాయిబాబానగర్‌లో వెలుగోడు డివిజన్ ఎస్ఆర్బీసీ ఈఈ శరభారెడ్డి ఉంటున్నారు. రోజూ మాదిరిగానే ఆయన డ్యూటీకి వెళ్లారు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో దొంగలు ఇంట్లోకి చొరబడి బీభత్స సృష్టించారు. బీరువా తాళం పగలగొట్టి 60 తులా బంగారు నగరలు, రూ.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులకు శరభారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానిక సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని తెలిపారు.

Next Story