- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Inhuman incident:ఓ వ్యక్తి దీనగాథ.. 20 ఏళ్లుగా!
ఏపీకి చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన దీనగాథ తాజాగా వెలుగులోకి వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీకి చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన దీనగాథ తాజాగా వెలుగులోకి వచ్చింది. టీ తాగేందుకు రైలు దిగి 20 ఏళ్ల పాటు కుటుంబానికి దూరమై.. వెట్టిచాకిరీలో మగ్గిపోయిన ఓ వ్యక్తి దీనగాథ ఇది. విజయనగరం జిల్లాకు చెందిన అప్పారావు 2005లో పుదుచ్చేరి వెళ్తూ తమిళనాడులోని ఓ రైల్వే స్టేషన్(railway Station)లో టీ(Tea) తాగుదామని దిగాడు. టీ తాగిన అప్పారావు మళ్లీ ఎక్కేలోపే ఆ రైలు వెళ్ళిపోయింది. ఈ క్రమంలో అతనికి ఏం చేయాలో తోచలేదు. అక్కడ ఉన్న వారిని అడిగిన ఏం ప్రయోజనం లేకపోయింది. ఓ వైపు చేతిలో డబ్బుల్లేవు.. ఇక అటు ఇటు తిరుగుతూ కలైయార్కోయిల్ ప్రాంతానికి చేరుకున్నాడు.
ఈ తరుణంలో అన్నాదురై(Annadurai) అనే వ్యక్తి వద్దకు చేరుకున్న అప్పారావు(Apparao) ఆయనకు చెందిన గొర్రెలను ఒక్క రూపాయి జీతం లేకుండా మేపి వెట్టిచాకిరి చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడు(Tamilnadu)లోని శివగంగ జిల్లాలో కార్మిక సంక్షేమ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కదంబంకుళం వెళ్లినప్పుడు అప్పారావు గొర్రెలు మేపుతూ కనిపించారు. ఈ క్రమంలో అధికారులు అప్పారావుతో మాట్లాడగా అనేక విషయాలు తెలుసుకున్నారు. ఈ తరుణంలో ఆయన స్థానికుడు కాదని గుర్తించారు. కనీసం తమిళనాడుకు చెందిన వ్యక్తి కూడా కాదని నిర్ధారించారు.
ఈక్రమంలో అతని గురించి సమాచారం కోసం సెర్చ్ చేయగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ఉమ్మడి విజయనగరం(Vijayanagaram) జిల్లా పార్వతీపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ వ్యక్తి 20 ఏళ్ల నుంచి కుటుంబానికి దూరంగా ఉన్నాడు. అయితే.. ఇన్ని ఏళ్లు ఎలాంటి జీతం ఇవ్వకుండా అప్పారావుతో వెట్టిచాకిరీ చేయించుకున్న యజమాని అన్నాదురైను పోలీసులు అరెస్టును చేసినట్లు సమాచారం. అప్పారావును కుటుంబం దగ్గరకు చేర్చేందుకు ఏపీ అధికారులతో కలిసి తమిళనాడు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.






