బండరాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య

by Thanuru Gopichand |

అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బండారాయితో తలపై కొట్టి వ్యక్తిని చంపిన (Murder) దారుణమైన ఘటన వెలుగు చూసింది.

బండరాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బండారాయితో తలపై కొట్టి వ్యక్తిని చంపిన (Murder) దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఈ అమానవీయమైన ఘటనతో అనకాపల్లి జిల్లా (Anakapalli) ప్రజానీకం ఒక్కసారిగా ఉలికిపడింది. పోలీసుల వివరాల ప్రకారం విశాఖపట్నం జిల్లా ఆగనంపూడికి చెందిన ఈగల వెంకు నాయుడు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని లంకెలపాలెంలో ఈ ఘోర ఘటన జరిగింది. లంకెలపాలెంలోని వినాయకనగర్ లేఅవుట్ లోని ఓ పార్కులో దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని చూసి పార్కుకు వచ్చినవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పరవాడ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడున్న వారిని పలు ప్రశ్నలు వేసి సమాచారం తెలుసుకున్నారు. పోలీసులకు సహాయంగా అక్కడకు చేరుకున్న క్లూస్ టీం ప్రాథమిక ఆధారాలను సేకరించింది. అయితే ప్రణాళిక ప్రకారమే వెంకు నాయుడు హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story