- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం.. 9 ఫైరింజిన్లతో మంటలార్పుతున్న సిబ్బంది
తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయ సమీపంలో ఉన్న మునోత్ ఇండస్ట్రీస్ లిథియం అయాన్ బ్యాటరీ కర్మకారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది....

X
దిశ, తిరుపతి: తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయ సమీపంలో ఉన్న మునోత్ ఇండస్ట్రీస్ లిథియం అయాన్ బ్యాటరీ కర్మకారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను అదుపు చేసేందుకు తక్షణ సహాయ చర్యలుగా 9 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. ఏర్పేడు పోలీసులు సహాయక చర్యల్లో విధుల నిర్వహిస్తున్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదానికి కారణం సాంకేతిక లోకమా! అకస్మాత్తుగా జరిగిన ప్రమాదమా నిర్ధారణ కావలసి ఉంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యాజమాన్యం మాత్రం అగ్ని ప్రమాదం గల కారణాలు వెల్లడించక, గోప్యంగా ఉంచినట్లు విశ్వసినీ సమాచారం. అయితే ఈ ప్రమాదంలో సుమారు 50 కోట్ల విలువ కలిగిన ఆస్తి నష్టం వాటిలినట్లు తెలుస్తోంది.
Next Story






