తాడేపల్లి కనకదుర్గమ్మ వారధిపై తప్పిన భారీ ప్రమాదం

by Vemula.Srinu Prasad |

గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గమ్మ వారధిపై భారీ ప్రమాదం తప్పింది...

తాడేపల్లి కనకదుర్గమ్మ వారధిపై తప్పిన భారీ ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur District) తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి(Tadepalli Kanakadurgamma Bridge)పై భారీ ప్రమాదం తప్పింది. బైక్‌లతో వెళ్తున్న కంటైనర్ లారీ(Container lorry) డీజిల్ ట్యాంకులు ఒక్కసారిగా ఊడిపోయి కిందపడ్డాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ లారీని వెంటనే నిలిపివేశారు. అయితే ట్యాంకులు పడిన సమయంలో వెనుక వైపు వాహనాలు రాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి గుంటూరు వైపు కంటైనర్ వెళ్తుండగా ఘటన జరిగింది. ఈ మేరకు విజయవాడ వైపు వెళ్లే వాహనాలు రోడ్డుపై భారీగా నిలిచిపోయాయి. దీంతో దాదాపు 2 కి.మీ ట్రాఫిక్ జామ్ అయింది. స్పాట్ చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో డీజిల్ ట్యాంకర్లను సరిచేశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేశారు.

Next Story