బీఎండబ్ల్యూ కారు బీభత్సం.. బైక్, ట్రాక్టర్‌ను ఢీకొట్టి...!

by Vemula.Srinu Prasad |

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురంలో పెను ప్రమాదం తప్పింది...

బీఎండబ్ల్యూ కారు బీభత్సం.. బైక్, ట్రాక్టర్‌ను ఢీకొట్టి...!
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా(Ntr District) తిరువూరు మండలం(Tiruvuru) లక్ష్మీపురం(Laxmipuram)లో పెను ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బీఎమ్‎డబ్య్లూ కారు(BMW Car) బీభత్సంతో జరిగింది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న సమయంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో ఎదురుగా ఉన్న డ్రమ్ములు, బైక్‌ను ఢీ కొట్టింది. అయినా స్పీడ్ కంట్రోల్ కాలేదు. పుల్లల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. అయితే కారులో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు.. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తదుపరి చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Next Story