- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ కైలాసగిరిలో తప్పిన పెను ప్రమాదం
విశాఖ కైలాసగిరిలో (Kailasagiri) పెను ప్రమాదం తప్పింది.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖ కైలాసగిరిలో (Kailasagiri) పెను ప్రమాదం తప్పింది. టూరిస్ట్ టాయ్ ట్రైన్ (Toy Train) బ్రేకులు ఫెయిలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాద సమయంలో వంద మందికి పైగా పర్యాటకులు టూరిస్ట్ ట్రైనులో ఉన్నారు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నంలోని కైలాసగిరికి పర్యాటకులు వస్తుంటారు. వారి కోసం టాయ్ ట్రైన్ ను అందుబాటులో ఉంటారు. ఈ ట్రైనులో కొండ అందాలను వీక్షించడానికి పర్యాటకు ఆసక్తి చూపుతారు. నిన్న మధ్యాహ్నం సమయంలో ఎప్పటిలాగానే టూరిస్టులతో టాయ్ ట్రైన్ కొండపై ప్రయాణానికి బయలుదేరింది. తిరిగి బోర్డింగ్ స్టేషన్ దగ్గరే ప్రయాణికులను దింపే క్రమంలో బ్రేకులు పడలేదని తెలుస్తోంది.
బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ట్రైన్ మళ్లీ వెనక్కు వెళ్లడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్లిన తరువాత రైలు ఆగిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమకేదో ప్రమాదం జరుగుతోందని ఆందోళనకు గురయ్యారు. అయితే ఎటవంటి ప్రాణహాని జరగకపోవడంతో బ్రతుకు జీవుడా అనుకున్నారు. నిర్వహణ లోపం కారణంగా ప్రమాదకర పరిస్థితి తలెత్తడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేయాలని.. నిర్వహణ లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.






