విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తప్పిన భారీ ప్రమాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-12 12:44:29  IST  )

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం తప్పింది...

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తప్పిన భారీ ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌(Visakha Steel Plant)లో భారీ ప్రమాదం తప్పింది. కోకోవెన్ బ్యాటరీ(Cocoven Battery)-5‌లో ద్రావకం లీక్(Solvent leak) అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లాడిల్ నుంచి ఉక్కు ద్రావకాన్ని తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన కార్మికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సకాలంలో మంటలార్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల కాలంలో ప్లాంట్‌లో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరగడంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

Next Story