అదుపు తప్పిన టిప్పర్.. టోల్ ప్లాజా ధ్వంసం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-11 12:56:35  IST  )

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది...

అదుపు తప్పిన టిప్పర్.. టోల్ ప్లాజా ధ్వంసం
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లారీ(Lorry) అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. అత్యంత స్పీడుగా వెళ్లి కాగిత టోల్‌ ప్లాజా(Paper toll plaza)ను ఢీకొట్టింది. విశాఖ(Visakha) నుంచి కాకినాడ(Kakinada) వైపునకు వెళ్తున్న లారీ ఒక్కసారిగా టోల్ ప్లాజా మొదటి కౌంటర్‌ నుంచి రెండో కౌంటర్‌పైకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ భయాందోళనకు గురయ్యారు. వాహనాలకు టోల్ వసూలు చేస్తుండగా ఒక్కసారిగా ఈ ఘటన జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే టోల్ ప్లాజా వద్దకు రాగానే లారీ అదుపు తప్పినట్లు డ్రైవర్ తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. తృటిలో పెను ప్రమాదం టోల్ నిర్వాహకులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Next Story