Breaking: రెండు గంటలకు పైగా పేలుళ్లు..18 మంది మృతి.. మృతుల్లో అధికంగా మహిళలు

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణా సంచా కేంద్రంలో జరిగిన పేలుళ్లలో అధిక సంఖ్యలో మహిళలు మృతి చెందినట్లు సమాచారం....

Breaking: రెండు గంటలకు పైగా పేలుళ్లు..18 మంది మృతి.. మృతుల్లో అధికంగా మహిళలు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణా సంచా కేంద్రంలో జరిగిన పేలుళ్లలో అధిక సంఖ్యలో మహిళలు మృతి చెందినట్లు సమాచారం. పేలుడు ధాటికి శరీర భాగాలు చెల్లాచెదరుగా పడటంలో మృతదేహాలు ఎవరివో తెలియడం లేదు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ప్రమాదం జరిగింది. ఇప్పటి నుంచి కూడా పేలుళ్లు కొనసాగుతున్నాయి. టపాసులు ఇంకా పేలుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదంలో18 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో కొంతమంది భోజనానికి వెళ్లడంలో మరింత ఘోరం తప్పిందని తెలుస్తోంది. టపాసులు ఒక్కసారిగా పేలడంతో అక్కడనున్న కార్మికులంతా మంటల్లో చిక్కుకున్నారు. బాణా సంచా తయారీ కేంద్రం నిర్వహాకుడు అడపా నాని కూడా కనిపించడంలేదని స్థానికులు అంటున్నారు.

ప్రస్తుతం ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం పర్యటనలో ఉన్న ఆయన సూర్యా ఫైర్ వర్క్ పేలుడుపై అధికారులకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు అందించాలని సూచించారు.

కాకినాడ జిల్లా వేట్లపాలెం-జి మేడపాడు మధ్య పంటపొల్లాల్లో బాణా సంచా తయారు చేస్తున్నారు అడపా నాని అనే వ్యక్తి. పొలాలను చదువు చేసి వరి పొలాల మధ్య ఎవరూ రాలేని ప్రాంతంలో ఈ బాణా సంచా కేంద్రాన్ని నడుపుతున్నారు. ఈ కేంద్రంలో ప్రతి రోజూ 25 నుంచి 30 మందికి పైగా పని చేస్తున్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సైతం అధిక సంఖ్యలో బాణా సంచా తయారీలో పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత బాణా సంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. రెండు గంటల పాటు పేలుళ్లు సంభవించినట్లు స్థానికులు తెలిపారు.

Next Story