బొల్లాపల్లిలో భర్త హత్యకేసును ఛేదించిన పోలీసులు.. భార్యే కిలాడి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-24 05:21:26  IST  )

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించి.. ఆపై మిస్సింగ్ డ్రామా ఆడిన కిలాడీ వైఫ్ బాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో మూడురోజుల క్రితం తన భర్త కనిపించడం లేదంటూ పోలీసుల్ని ఆశ్రయించింది ఓ మహిళ.

బొల్లాపల్లిలో భర్త హత్యకేసును ఛేదించిన పోలీసులు.. భార్యే కిలాడి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రియుడితో కలిసిభర్తను హత్య చేయించి.. ఆపై మిస్సింగ్ డ్రామా ఆడిన కిలాడీ వైఫ్ బాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో మూడురోజుల క్రితం తన భర్త కనిపించడం లేదంటూ పోలీసుల్ని ఆశ్రయించింది ఓ మహిళ. అన్నిచోట్లా అతనికోసం వెతుకుతున్నట్లుగా అందరినీ నమ్మించినా.. పోలీసులకు ఆమెపైనే అనుమానం వచ్చింది. కూపీ లాగగా.. ప్రియుడితో కలిసి చంపినట్లు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు శివారు గ్రామమైన గోరంట్లకు చెందిన ప్రదీప్ (45) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం మరియమ్మతో అతనికి పెళ్లైంది. కానీ కొంతకాలంగా భార్యకు సాంబశివరావు అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన ప్రదీప్.. మరోసారి ఇలా చేయొద్దని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు.

అప్పటి నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగుతుండటంతో.. ప్రియుడికి తన బాధను మొరపెట్టుకుంది. ప్రదీప్ వేధింపులు భరించలేకపోతున్నానని, చంపేస్తే అడ్డు ఉండదని రెచ్చగొట్టింది. దాంతో సాంబశివరావు ప్రదీప్ హత్యకు స్కెచ్ వేశాడు. తన ఇంటిలో పని చేయాల్సి ఉందని ప్రదీప్ ను తీసుకెళ్లిన సాంబశివరావు.. నెహ్రూనగర్ తండాలో ఫుల్లుగా మద్యం తాగించి, అతని మెడకు లుంగీ బిగించి హత్య చేశాడు. అనంతరం తన ఇంటికి వెళ్లిపోయాడు. ఇంతలో మరియమ్మ భర్త కనిపించడం లేదని డ్రామా మొదలుపెట్టింది. ఆమె తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందని తెలుసుకున్నారు. మరియమ్మ, సాంబశివరావులను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేసి, మర్డర్ కేసు ఫైల్ చేశారు.

Read More... దారుణం.. కుటుంబంపై ఒక్కసారిగా దాడి ఒకరు మృతి

Next Story