కర్నూలు యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు.. వేర్వేరుగా బైక్, కావేరి బస్సు ప్రమాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-25 09:32:23  IST  )

కర్నూలు బస్ యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు తిరిగింది..

కర్నూలు యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు.. వేర్వేరుగా బైక్, కావేరి బస్సు ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool) చిన్నటేకూరు(Chinnatekuru)లో వి. కావేరి బస్సు దగ్ధం(V. Kaveri Bus Fire) కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. బస్సు(Bus), బైక్(Byke) రెండు వేర్వేరుగా ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బైకర్ శివశంకర్‌కు తొలుత రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో శివశంకర్‌తో పాటు ఎర్రిస్వామి అనే వ్యక్తి ఉన్నారు. హైవేపై ప్రమాదం జరిగిన వెంటనే శివశంకర్ తలకు బలమైన గాయం అయింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అయితే రోడ్డుపై పడిపోయిన బైక్‌ను పక్కకు తీసేందుకు ఎర్రిస్వామి ప్రయత్నం చేశారు. ఈలోగా కావేరి బస్సు చీకట్లో వేగంగా వచ్చింది. బైక్‌ను ఈడ్చుకెళ్లింది. దీంతో రోడ్డుకు రాసుకుని బైక్ పెట్రోల్ ట్యాంకు లీక్ అయి మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు అంటుకుని బస్సు దగ్ధం అయింది. ఈ విషయాలను పోలీసుల విచారణలో ఎర్రిస్వామి తెలిపారు. ఎర్రిస్వామి స్టేట్ మెంట్ ఆధారంగా తదుపరి దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్నారు.

కాగా బస్సు ప్రమాద ఘటనలో 19 మంది సజీవదహనమయ్యారు. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు, క్షతగాత్రులు తెలంగాణ, ఏపీ వాసులు. డీఏన్ఏ ఆధారంగా మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Next Story