జనసేనలోకి కీలక నేత.. పవన్ సమక్షంలో చేరిక

by Vemula.Srinu Prasad |

విశాఖ జిల్లా కీలక నేత జనసేన తీర్థం పుచ్చుకున్నారు...

జనసేనలోకి కీలక నేత.. పవన్ సమక్షంలో చేరిక
X

దిశ, వెబ్ డెస్క్: జనసేనలోకి వలసలు జోరందుకున్నాయి. ఎన్నికల సమీస్తున్న వేళ ఆ పార్టీకి మరింత బలం పెరుగుతోంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చడంతో ఆ పార్టీలో చేరేందుకు నేతలు, కార్యకర్తలు, సామాన్యులు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు జనసేనలో చేరారు.

తాజాగా విశాఖ జిల్లా కీలక నేత జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పెందుర్తి నియోజవర్గానికి చెందిన మాజీ జడ్పీటీసీ కంచిపాటి విశ్వనాథ్ నాయుడు జనసేనలో చేరారు. అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ్‌ను పవన్ కల్యాణ్ సాదరణంగా జనసేనలోకి ఆహ్వానించారు. విశాఖ జిల్లాలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కాశీ విశ్వనాథ్‌కు పవన్ కల్యాణ్ సూచించారు.

కాగా జనసేన, టీడీపీ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లనున్నాయి. అయితే పొత్తుల్లో భాగంగా అభ్యర్థులు, సీట్ల ఖరారుపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం మేనిఫెస్టో పై ఆ పార్టీలు దృష్టి సారించాయి. మరోవైపు వైసీసీ ఇంచార్జుల మార్పులతో ఆ పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. సీట్లు ఖరారు కాకపోవడంతో ఆయా నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కొందరు జనసేనలో చేరుతున్నారు.

Next Story