ఏపీలో కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటు చేయండి.. జలవనరుల శాఖ లేఖ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-13 14:19:32  IST  )

తెలుగు రాష్ట్రాల్లో జల పంచాయితీ నడుస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది...

ఏపీలో కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటు చేయండి.. జలవనరుల శాఖ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో జల పంచాయితీ నడుస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లో కృష్ణా రివర్ బోర్డు(Krmb) ఏర్పాటు చేయాలని జనవనరుల శాఖ(Human Resources Department) డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కేఆర్ఎంబీకి అధికారులు లేఖ రాశారు. కృష్ణా రివర్ బోర్డు కార్యాలయం ఏర్పాటుకు కార్యచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌(Hyderabad)లో ఉన్న కృష్ణా రివర్ బోర్డును తక్షణమే అమరావతికి తరలించాలని కోరారు. విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీని ఏర్పాటు చేస్తే తాము కావాల్సిన వసతులు కల్పిస్తామని లేఖలో జనవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు.

కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నీటి(Krishna Water) విషయంలో జగడాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే 2014లో ఏపీ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. ఏపీ, తెలంగాణ(Ap, Telangana)గా రెండు రాష్ట్రాలు ఏర్పాడ్డాయి. గతంలో కేటాయించిన నీటినే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కృష్ణా నీటిని రెండు ప్రాంతాలు వినియోగించుకుంటున్నాయి. ఏ వివాదం, సమస్య వచ్చినా హైదరాబాద్‌లో ఉన్న కృష్ణా రివర్ బోర్డు పరిధిలో చర్చలు జరిగాయి.

అయితే రాష్ట్ర విభజన జరగడంతో చట్ట ప్రకారం కృష్ణా రివర్ బోర్డును తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఏపీ కోరుతోంది. ఇప్పటికే పలుమార్లు కేంద్రంతో పాటు కేఆర్‌ఎంబీకి ఆ రాష్ట్ర జనవనరుల శాఖ అధికారులు లేఖలు రాస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు అవుతోంది. అయినా కృష్ణా బోర్డును ఏర్పాటు చేయకపోవడంతో తాజాగా కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ జలవనరుల శాఖ లేఖ రాసింది. మరి కేఆర్ఎంబీ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Next Story