TTD పరకామణిలో చోరీ.. సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు నివేదిక

by Vemula.Srinu Prasad |

పరకామణి కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది...

TTD పరకామణిలో చోరీ..  సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు నివేదిక
X

దిశ, వెబ్ డెస్క్: పరకామణి కేసు(Parakamani case)లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు(HighCourt)కు సీఐడీ(Cid) అధికారులు సీల్డ్ కవర్‌లో నివేదక సమర్పించారు. ఈ కేసు విచారణ సోమవారంతో ముగియడంతో హైకోర్టుకు సీఐడీ అధికారులు నివేదిక సమర్పించారు. అంతేకాదు ఈ కేసు రాజీవ్యవహారాలను కూడా నివేదికలో పొందుపర్చారు. మరోవైపు నిందితుడు రవికుమార్ ఆస్తుల వివరాలపై హైకోర్టుకు ఏసీబీ(Acb) నివేదికను అందజేసింది. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ నివేదికలను పరిశీలించేందుకు తమ ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 5కు వాయిదా వేసింది.

కాగా జగన్(Jagan) ప్రభుత్వ హయాంలో పరకామణిలో చోరీ జరిగింది. హుండీ లెక్కింపులో అమెరికన్ డార్లను పెద్ద జియంగార్ మళం గుమస్తా కోయంబత్తూరు రవికుమార్ చోరీ చేసి దొరికిపోయారు. ఈ చోరీపై క్రిమినల్ కేసు నమోదు అయింది. అయితే ఈ కేసును టీటీడీ ఏవీఎస్‌వో సతీశ్ కుమార్(TTD AVSO Satish Kumar) ఆధ్వర్యంలో లోక్ అదాలత్‌లో రాజీచేశారు. అంతేకాదు రవికుమార్ ఆస్తులను టీటీడీకి విరాళంగా రాయించుకున్నారు. అప్పట్లో ఈఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అయితే ఈ కేసు మూసివేయడంపై తిరుపతికి చెందని జర్నలిస్టు శ్రీనివాసులు హైకోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో తిరుమల పోలీస్ స్టేషన్, టీటీడీ కార్యాలయాల్లోని కేసు ఫైళ్లను, రికార్డులను స్వాధీనం చేసుకుని సీఐడీకి అప్పగించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ కేసుకు సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించింది. అయితే ఈ కేసును స్వయంగా సీడీఐ విచారించి ఆ నివేదికను డిసెంబర్ 2న నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసు విచారణను ముగించి మంగళవారం హైకోర్టుకు సీఐడీ అధికారులు నివేదికను సమర్పించారు.

Next Story