- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: శ్రీవారి లడ్డూ కల్తీ ఘటనలో నలుగురు అరెస్ట్
శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి లడ్డూ(Srivari Laddu) కల్తీ నెయ్యి(Adulterated Ghee) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంతకాల విచారణ జరిపిన సిట్ అధికారులు(SIT officials).. నలుగురు నెయ్యి సరఫరాదారులను తాజాగా అరెస్ట్ చేశారు. ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్(AR Dairy MD Rajasekaran)తో పాటు డెయిరీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం వీరిని తిరుపతి కోర్టు(Tirupati Court)లో ప్రవేశ పెట్టనున్నారు.
కాగా గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూల తయారీలో జంతువుల అవశేషాలను వినియోగించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను చంద్రబాబు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కల్తీ నెయ్యి ఘటనపై సిట్ ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వేసిన సిట్‌లో చంద్రబాబు అనుకూల అధికారులు ఉన్నారని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ధర్మాసనమే సీబీఐ అధికారితో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారి ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందం తిరుమలలో పర్యటించి విచారణ చేపట్టింది. ఈ విచారణలో పలు కీలక విషయాలు తెలిసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏఆర్ డెయిరీ, పరాగ్ ఫుడ్స్, ప్రీమియమ్ అగ్రి, ఆల్ఫా మిల్స్ ఫుడ్ ప్రతినిధులను అరెస్ట్ చేశారు. సీబీఐ జేసీ వీరేశ్ ప్రభు ఆధ్వర్యంలో సిట్ బృందం తిరుపతిలో ఉండి దర్యాప్తును వేగంగా చేశారు.






