- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సునీత పిటిషన్‌పై విచారణ
వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది....

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసు(Former Minister Vivekananda Reddy Murder Case) విచారణ సీబీఐ కోర్టు(CBI Court)లో జరిగింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై తాజాగా సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. సునీత తరపు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా వాదనలు కొనసాగించారు. వివేకా హత్య కేసులో కుట్ర కోణం ఉందని కోర్టుకు వివరించారు.
సీబీఐ పూర్తిస్థాయి దర్యాప్తు జరపలేదని గుర్తు చేశారు. CBI ఒకదశ వరకు విచారణ జరిపి వదిలేసిందన్నారు. కేసులో లోతైన దర్యాప్తు అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపకపోతే అసలు దోషులు తప్పించుకునే అవకాశం ఉందని చెపపారు. వివేకా కేసులో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే శుక్రవారం నిందితుల తరపు వాదనలు కొనసాగనున్నాయి. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.






