తిరుపతి లడ్డూ నెయ్యి కేసులో కీలక పరిణామం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-04 08:41:37  IST  )

తిరుపతి లడ్డు నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది....

తిరుపతి లడ్డూ నెయ్యి కేసులో కీలక పరిణామం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati) లడ్డూ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్‌ పీఏ అప్పన్న(Former TTD Chairman PA Appanna)కు సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అప్పన్నను తిరుపతిసిట్‌ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయనను అక్కడే ఉంచి ప్రశ్నిస్తున్నారు. తిరుపతి లడ్డూ కల్తీ వెనుక ఎవరున్నారు. ‘అసలు ఎక్కడ జరిగింది. ఎవరెవరి పాత్ర ఉంది.’ అనే కోణంలో అప్పన్నను ప్రశ్నిస్తున్నారు.

ఇక ఇదే పలువురిని ఇప్పటికే ప్రశ్నించారు. కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నెయ్యి సరఫరా చేసిన సంస్థతో పాటు పలువురిపైనా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. కానీ సీబీఐ బృందంలోని సిట్‌ను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ అధికారితో పాటు నలుగురు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. తిరుపతి, తిరుమలతో పలు ప్రదేశాల్లోనూ విచారణ నిర్వహించారు. పలు కీలక ఆధారాలు రాబట్టారు. ఈ మేరకు దర్యాప్తును కొనసాగిస్తు్న్నారు. ఇందులో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్‌ పీఏ అప్పన్నను అదుపులోకి తీసుకున్నారు.

Next Story