పార్టీ ఫిర్యాయింపులో కీలక పరిణామం.. ఒకరిపై చర్యలకు రంగం సిద్ధం..?

by Vemula.Srinu Prasad |

పార్టీ ఫిర్యాయింపుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది...

పార్టీ ఫిర్యాయింపులో కీలక పరిణామం.. ఒకరిపై చర్యలకు రంగం సిద్ధం..?
X

దిశ, వెబ్ డెస్క్: పార్టీ ఫిర్యాయింపుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 26 మందిపై చేసిన ఫిర్యాదుపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరిశీలన చేశారు. అయితే 26 మందిలో 25 మందికి పార్టీ విప్ స్వయంగా అందని నేపథ్యంలో వారిపై వేటు వేయడం కుదరలేదు. కానీ ఒకరిపై మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

విశాఖ(Visakha) గ్రేటర్‌లో ఇటీవల జీవీఎంసీ(Gvmc) మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. 26 మంది వైసీపీ కార్పొరేటర్లు(Ycr Corporators) కూటమికి మద్దతు ఇవ్వడంతో జీవీఎంసీపై తెలుగుదేశం జెండా(Telugudesam Flag) ఎగిరింది. అయితే ఎన్నికకు ముందు తమ కార్పొరేటర్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) విప్ జారీ చేసింది. అయినా సరే 26 మంది కార్పొరేటర్లు విప్ ధిక్కరించారు. టీడీపీ(Tdp)కి అనుకూలంగా వ్యహరించారు. దీంతో వారిని అనర్హులుగా ప్రకటించాలని కలెక్టర్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరిశీలన చేసిన అధికారులు.. విశాఖ 80వ డివిజన్ కార్పొరేటర్ నీలిమ పార్టీ విప్‌ను ధిక్కరించినట్లు నిర్ధారించారు. మిగిలిన వారికి విప్ ధిక్కరణ నోటీసులు నేరుగా అందని కారణంగా వైసీపీ ఫిర్యాదును తిరస్కరించారు.. కాగా వచ్చే ఏడాది మార్చితో జీవీఎంసీ కౌన్సిల్ వ్యవధి ముగియనుంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

Next Story