ఏసీబీ కోర్టులో మద్యం కేసు నిందితుల పిటిషన్.. విచారణ వాయిదా

by Vemula.Srinu Prasad |

లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

ఏసీబీ కోర్టులో మద్యం కేసు నిందితుల పిటిషన్.. విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెయిల్(Bail) కోసం నిందితులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాల్లో జరిగిన అవకతవకలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు నిందితులు రాజ్ కేసిరెడ్డి(Raj Kesireddy), సజ్జల శ్రీధర్ రెడ్డి(Sajjala Sridhar Reddy) బెయిల్ ఇవ్వాలని కోర్టుతూ ఏసీబీ కోర్టు(Acb Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మద్య కేసు నిందితుల తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున నాయవాది సిద్ధార్థ్ లుద్రా వాదనలు వినిపించారు.

Next Story